‘జనతా గ్యారేజ్’ కు వసూళ్ల వర్షం | Janatha Garage did GOOD biz on US | Sakshi
Sakshi News home page

‘జనతా గ్యారేజ్’ కు వసూళ్ల వర్షం

Published Wed, Sep 7 2016 9:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

‘జనతా గ్యారేజ్’ కు వసూళ్ల వర్షం

‘జనతా గ్యారేజ్’ కు వసూళ్ల వర్షం

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’  అమెరికాలో దూసుకుపోతోంది. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అమెరికాలో ఈ సినిమా వసూళ్లు రూ. 10 కోట్లు దాటాయి. సోమవారం నాటికి రూ. 10.30 కోట్లు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. డివైడ్ టాక్ వచ్చినా ‘జనతా గ్యారేజ్’  బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. నాలుగురోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్‌ను అధిగమించి టాలీవుడ్‌లో 'బాహుబలి' తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్‌' రికార్డు సృష్టించింది. కలెక్షన్లు నిలకడగా ఉండడంతో ‘జనతా గ్యారేజ్’  రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలున్నాయని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement