ఇప్పటి వరకు టాలీవుడ్కే పరిమితమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు తన మార్కెట్ పరిధి పెంచుకునే పనిలో పడ్డాడు. మూస మాస్ ఫార్ములా నుంచి బయటకు వచ్చిన జూనియర్, ప్రయోగాలకూ రెడీ అంటున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో మంచి విజయాలు సాధించిన బుడ్డోడు, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మాలీవుడ్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. తెలుగులో జనతా గ్యారేజ్ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తమిళ, మళయాల భాషల్లో కూడా అదే పేరుతో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ మరో కొత్త లుక్లో కనిపిస్తున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్కు రెడీ అవుతోంది.
మూడు భాషల్లో ఒకే టైటిల్
Published Thu, May 19 2016 11:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement
Advertisement