జోరు చూపిస్తున్న జూనియర్ | ntr koratala siva janatha garage to kick start soon | Sakshi
Sakshi News home page

జోరు చూపిస్తున్న జూనియర్

Published Sat, Dec 26 2015 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

జోరు చూపిస్తున్న జూనియర్

జోరు చూపిస్తున్న జూనియర్

'టెంపర్' సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జోరు చూపిస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండో సినిమాను ఫైనల్ చేసిన జూనియర్ వెంటనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' సినిమాలో నటిస్తున్నయంగ్ టైగర్ సంక్రాంతికి ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నాన్నకు ప్రేమతో సెట్స్ మీద ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాను ప్రారంభించిన ఎన్టీఆర్, త్వరలోనే  ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఆదివారం ఆడియో రిలీజ్ను కూడా గ్రాండ్గా నిర్వహించనున్నారు. ప్యాచ్ వర్క్తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పూర్తయిన తరువాత కేవలం రెండు వారాల గ్యాప్ తీసుకొని మరో సినిమాను మొదలుపెడుతున్నాడు ఎన్టీఆర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement