సెప్టెంబర్ 2కు అంతా ఓకె | thirrunavukarasu Assurance on Janatha Garage Release Date | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 2కు అంతా ఓకె

Published Tue, Aug 23 2016 10:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

సెప్టెంబర్ 2కు అంతా ఓకె

సెప్టెంబర్ 2కు అంతా ఓకె

టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి వరుస హిట్స్ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఇంత వరకు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాకపోవటంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా..లేదా..? అన్న అనుమానాలు కలిగాయి. సెప్టెంబర్ 2న భారత్ బంద్ కూడా ఉండటంతో సినిమా పోస్ట్ పోన్ లేదా.. ప్రీ పోన్ అయ్యే అవకాశం ఉందని భావించారు.

అయితే ఈ అనుమానాలకు చెక్ పెడుతూ, సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ రిలీజ్కు అంతా రెడీ అంటూ ప్రకటించాడు, చిత్ర సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు. ఇటీవల ఆఖరి పాట షూటింగ్ పూర్తయిన సందర్భంగా తిరు తన ట్విట్టర్లో చేసిన ట్వీట్ ద్వారా సినిమా రిలీజ్ డేట్ను కన్ఫామ్ చేశాడు. మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ భారీగా రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement