
సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు
సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటే ఆ హీరోయిన్ డేట్స్ దొరికించుకోవటం చాలా కష్టం. ఇక గోల్డెన్ లెగ్ అని ముద్ర పడ్డ బ్యూటీ విషయంలో పోటీ మరీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా ఈ పరిస్థితుల్లో తమ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేసి, భారీగా కాసులు వెనకేసుకోవాలని భావిస్తారు.
కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం కొత్తగా ఆలోచిస్తుంది. ఇటీవల 24, అ..ఆ.. లాంటి సూపర్ హిట్స్ అందుకున్న సమంత ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న జనతా గ్యారేజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈసినిమా తరువాత సమంత ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు. జనత గ్యారేజ్ షూటింగ్ కూడా పూర్తి కావస్తుండటంతో సమంత.., సినిమాలు ఎందుకు అంగీకరించటం లేదన్న చర్చ మొదలైంది.
కొద్ది రోజులుగా బిజీ షెడ్యూల్స్తో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న జెస్సీ, కుటుంబానికి సమయం కేటాయించేందుకే సినిమాలు అంగీకరించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్గా ఎనౌన్స్ చేయలేదు. కెరీర్ పీక్స్లో ఉన్న ఇలాంటి సమయంలో బ్రేక్ తీసుకోవటం సమంత ఫ్యూచర్కు అంత మంచిది కాదన్న టాక్ కూడా వినిపిస్తోంది.