
సమంత చాలా నాటీ..
క్యూటీ సమంత చాలా నాటీ కూడా. తను సంతోషంగా ఉండటమే కాదు తన చుట్టూ ఉన్నవాళ్లని కూడా సరదాల్లో ముంచేస్తుంది. ప్రస్తుతం 'జనతా గ్యారేజ్' పాట చిత్రీకరణ కోసం కేరళలో ఉంది సమంత. అక్కడి అందమైన లొకేషన్లకి ఫిదా అయిపోయిన శామ్స్.. యూనిట్ మొత్తాన్ని షూటింగ్ ఆపేలా చేసింది. జలపాతం వద్ద షూటింగ్ జరుగుతుండగా.. ముందు తమతో కలిసి తడవాల్సిందేనంటూ డైరక్టర్ కొరటాల శివని ఒప్పించింది. సమంత సంబరపడటంతో షూటింగ్కి కాసేపు బ్రేక్ ఇచ్చి యూనిట్ మొత్తం ఆ చిరుజల్లుల్లో తడిసి ముద్దయ్యింది. ఆ సంతోషాన్నంతా ఫొటోతో సహా ట్విట్టర్లో షేర్ చేసింది సమంత.
జనతా గ్యారేజ్లో సమంత.. తారక్తోపాటు ఐఐటీ స్టూడెంట్గా కనిపించనుంది. అయితే సమంతతోపాటు ఎన్టీఆర్కు కూడా తమ కెరీర్లో ఇది 26 వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటిస్తున్న నిత్యా మీనన్ పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్. ఆగస్టు 12 న ఆడియో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్.. సెప్టెంబర్ 2 వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.
Shoot on hold until the director agreed to get drenched with us.Easiest person in the world to bully❤️