'జనతా గ్యారేజ్'లో నితిన్ | hero nitin visited janatha garage sets in hyderabad | Sakshi
Sakshi News home page

'జనతా గ్యారేజ్'లో నితిన్

Published Fri, Jun 10 2016 5:10 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

'జనతా గ్యారేజ్'లో నితిన్

'జనతా గ్యారేజ్'లో నితిన్

హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' సెట్స్లో హీరో నితిన్ సందడి చేశాడు. 'జనతా గ్యారేజ్ సెట్స్‌కు శుక్రవారం వెళ్లాను. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్‌ను కలిశాను. ఆయన డ్యాన్స్ చూడటం ఎంతో ఆనందంగా ఉంది' అని నితిన్ పేర్కొన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మరో వైపు నితిన్ హిరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అ..ఆ.. అనసూయ రామలింగం వర్సెన్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్తో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. వేరే సినిమాలేవి బరిలో లేకపోవటం, సమ్మర్ సీజన్కు ఆఖరి చిత్రం కావటంతో కలెక్షన్ల పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో చిత్రాన్ని అద్భుతంగా తీసిన త్రివిక్రమ్‌కు నితిన్ కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement