ఆగస్టు 12న జనతా గ్యారేజ్ ఆడియో | Janatha Garages Audio Launch on August 12 | Sakshi
Sakshi News home page

ఆగస్టు 12న జనతా గ్యారేజ్ ఆడియో

Published Tue, Aug 2 2016 11:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

ఆగస్టు 12న జనతా గ్యారేజ్ ఆడియో

ఆగస్టు 12న జనతా గ్యారేజ్ ఆడియో

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. షూటింగ్ మొదలైనప్పటి నుంచే మంచి హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. పోస్ట్ ప్రొడక్షన్  పనులు పూర్తికావన్న ఉద్దేశంతో వాయిదా వేశారు.

అయితే ఎప్పటి నుంచో ఆగస్టు 12 మీద ఆశలు పెట్టుకున్న అభిమానులను నిరాశపరచకూడదని.. అదే రోజు ఆడియో రిలీజ్ను ప్లాన్ చేశాడు జూనియర్. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మళయాల నటులు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్ రిలీజ్ తరువాత రికార్డ్లు తిరగరాయటం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement