జూనియర్ కెరీర్కు 15 ఏళ్లు
టాలీవుడ్లో స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, హీరోగా 15 ఏళ్ల కెరీర్ను పూర్తిచేసుకున్నాడు. 2001 మే 25న రిలీజ్ అయిన 'నిన్ను చూడాలని' సినిమాతో తొలిసారిగా వెండితెర మీద దర్శనమిచ్చిన జూనియర్, ఆ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'స్టూడెంట్ నెంబర్ వన్' ఎన్టీఆర్ కెరీర్ను మలుపు తిప్పింది.
ఆ సినిమా సక్సెస్తో ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్.. ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో తిరిగులేని మాస్ హీరోగా ఎదిగాడు. అంతేకాదు నందమూరి ఫ్యామిలీకి నవతరం వారసుడిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకొని యంగ్ జనరేషన్లో టాప్ హీరోగా ఎదిగాడు. మధ్యలో చాలాసార్లు కెరీర్ పరంగా తడబడినా తాజాగా టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్లతో తిరిగి ఫాంలోకి వచ్చాడు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వలో జనతా గ్యారేజ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఎన్టీఆర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతోంది.