విజయానికి పోరాటం చేయాల్సిందే | Samantha in NTR Janatha Garage | Sakshi
Sakshi News home page

విజయానికి పోరాటం చేయాల్సిందే

Published Thu, Jul 28 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

విజయానికి పోరాటం చేయాల్సిందే

విజయానికి పోరాటం చేయాల్సిందే

విజయ సాధనకు పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుందని నటి సమంత అంటున్నారు. ఈ చెన్నై చంద్రం చేతిలో జనతా గ్యారేజ్ అనే ఒకే ఒక్క చిత్రం ఉంది. అదీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కొత్త చిత్రం ఏదీలేదు. అయితే అవకాశాలు రాక కాదు. వాటిని సమంత అంగీకరించడం లేదనే ప్రచారం సినీవర్గాల్లో బాగా స్ప్రెడ్ అయ్యింది.
 
 కారణం ఈ బ్యూటీ టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో మూడు ముళ్లబంధంతో ఏడడుగులు నడవడానికి సిద్ధమవుతున్నారన్నదే. అయితే పెళ్లెప్పుడో చెప్పలేదుగానీ తన ప్రేమను మాత్రం సమంత బహిరంగంగానే ప్రకటించారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ జీవితంలో సాధించాలనుకునే వారికి విజయపథం గురించి చెప్పారు. అదేమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే చూడండి.
 
  మనిషి ఏ రంగంలో అయినా విజయమే లక్ష్యం అవుతుంది. అయితే అలాంటి విజయం కోసం పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. లేకుంటే కలల ప్రపంచంలో జీవించాల్సిందే. ఊరికే ఉంటే ఏదీ సొంతం కాదు. పోరాడే వాళ్లకే ఆ లోకం సొంతం అవుతుంది. విజయం లక్ష్యంగా పోరాడేవాళ్లకు అవరోధాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బాంధవ్యాలకు దూరం కావచ్చు. కొందరు ద్రోహులుగానూ మారవచ్చు. మనల్ని నిద్రకు దూరం చేయవచ్చు. వాటన్నిటికి సిద్ధపడి పయనాన్ని సాగించినప్పుడు విజయం వరించడం తథ్యం.ఆ తరువాత మనం ఇంతకు ముందు పోగొట్టుకున్నవన్నీ దరి చేరతాయి. ఇందుకు నేనే ఒక ఉదాహరణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement