
రామ్
‘హలో గురు ప్రేమకోసమే’ వంటి హిట్ సినిమా తర్వాత రామ్ నటించనున్న చిత్రంపై ఇటీవల క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. పూరి కనెక్ట్స్ సహకారంతో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్ ప్రకటించారు. అలాగే గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ కనిపించనున్నారు. పూరి స్టైల్‌కి, రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా టైటిల్ మాసీగా ఉంది కదూ. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్ ఆకట్టుకుంటోంది‘‘ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. వీలైనంత త్వరలో సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment