
నిధీ అగర్వాల్
‘ఇస్మార్ట్ శంకర్’కి జోడీగా నటించే గర్ల్ ఎవరు? అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకి ఫుల్‌స్టాప్ పడింది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి హీరో రామ్ సరసన పలువురి కథానాయికల పేర్లు హల్‌చల్ చేశాయి. ఫైనల్లీ ఇస్మార్ట్ శంకర్‌తో జోడీ కట్టే చాన్స్ అందుకుని ఇస్మార్ట్ గర్ల్ అనిపించుకున్నారు నిధీ అగర్వాల్. అన్న నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నిధీ అగర్వాల్ తాజాగా తమ్ముడు అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ అవకాశం దక్కించుకున్నారు.
హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’తో కథానాయికగా పరిచయమైన నిధి ఆ తర్వాత తెలుగుకి వచ్చారు. ఇప్పుడు హిందీలో ‘ఇక్కా’ అనే చిత్రం అంగీకరించారట. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ విషయానికొస్తే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య, సంగీతం: మణిశర్మ, కెమెరా: రాజ్ తోట.
Comments
Please login to add a commentAdd a comment