
‘ప్రతి పెళ్లికి ఓ స్టోరీ ఉంటుంది. అది ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది ’అంటుంది సింగర్ సునీత. తన పాటలతో లక్షలాది మంది అభిమానులను సంపాందించుకున్న సునీత గతేడాదిలో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021, జనవరి 9న ప్రముఖవ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత వివాహం జరిగింది. నేడు(జనవరి 9) వారి తొలి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ‘వెడ్డింగ్ మెమోరీస్’అంటూ వివాహ వేడుక జ్ఞాపకాలు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది సునీత.
అందులో తమ గురించి, తమ వివాహం గురించి ఇరు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఉన్నాయి. సునీత గురించి ఆమె తల్లి మాట్లాడుతూ..‘బరువు, బాధ్యతలన్నీ తీర్చుకుంటూ.. ఎప్పుడూ చిరునవ్వుతో.. అన్ని సహనంతో చేసుకుంటూ ముందడుగు వేసింది. డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ తనది’అని చెప్పుకొచ్చింది.
అలాగే రామ్‌పై సునీతకు ఉన్న ఒపీనియన్ ఏంటో కూడా ఆ వీడియో ఉంది. ‘రామ్ తనుకు ఎనిమిదేళ్లుగా తెలుసు, చాలా నీజాయితీపరుడు, ఏదైనా ముఖంపైనే చెప్పే వ్యక్తిత్వం తనది. అతను మంచి కాఫీ లాంటి అబ్బాయ్’ అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది సునీత .
‘సునీత జీవితంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొంది.ఇప్పటికీ మా కుటుంబానికి పెద్ద కొడుకులాగానే ఉంటుంది’అని సునీత తండ్రి అన్నారు.
పెళ్లి తర్వాత తన జీవితం చాలా బ్యూటీఫుల్‌గా సాగుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సునీత ‘వెడ్డింగ్ మెమోరీస్’నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment