
బేబమ్మ కృతీ శెట్టి భలేగా ఆఫర్లు చేజిక్కించుకుంటున్నారు. ఇప్పటికే ‘శ్యామ్‌సింగ రాయ్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేశారు. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రలో సునాయాసంగా ఒదిగిపోయిన ఈ బ్యూటీ తాజాగా మహేశ్‌బాబు సరసన నటించే బంపర్ ఆఫర్ దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’తో బిజీగా ఉన్నారు మహేశ్. అలాగే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి కాస్త టైమ్ పట్టేలా ఉందట. ఈ గ్యాప్‌లో మహేశ్‌బాబు ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాకు దర్శకులుగా త్రివిక్రమ్, అనిల్ రావిపూడి పేర్లు వినిపిస్తున్నాయి. అనిల్‌తో మహేశ్ సినిమా కన్ఫార్మ్ అయితే అందులో హీరోయిన్ కృతీ శెట్టే అనేది లేటెస్ట్ టాక్. మరి... అనిల్ డైరెక్షన్ లో మహేశ్ సినిమా చేస్తారా? ఇందులో కృతీ నటిస్తారా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment