అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా దేశ భక్తి చిత్రం రామ్ .దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత దీపికాంజలి కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్ మీద ఐదు రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తామని ప్రకటించారు.
‘మాకు ఇది మొదటి సినిమా. మేం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు. సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారు. భాను చందర్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్‌లో రూ.5/- లు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాం. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామ’ని దీపికాంజలి అన్నారు.
‘కంటెంట్ ఉంటే.. చిన్న చిత్రాలు కూడా పెద్ద చిత్రాలుగా మారుతున్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని పీపుల్ మీడియా ఫాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల అన్నారు. ‘ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం సైనికులు పోరాడుతుంటారు. అలాంటి వారిపై వచ్చిన ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, మంచి విజయాన్ని అందిచాలి’అని నిర్మాత బెకెం వేణుగోపాల్ అన్నారు.
‘రామ్ దేశ భక్తిని చాటి చెప్పే చిత్రమే కానీ.. బార్డర్‌లో ఉండే సైనికుల గురించి చెప్పేది కాదు. దేశసరిహద్దు లోపల టెర్రర్ అటాక్ బారి నుంచి మనల్ని కాపాడే అన్ సంగ్ హీరోల గురించి చూపించాను’అని దర్శకుడు మిహిరాం అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు అయ్యలసోమయాజుల,ధన్య బాలకృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment