
Singer Sunitha: గాయనిగా, అనువాద కళాకారిణిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీత త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ వీరపనేనిని రెండవ వివాహం చేసుకుని, వ్యక్తిగతంగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారామె. ఇప్పుడు వృత్తిపరంగా ఓ కొత్త ప్రయాణం ఆరంభించనున్నారని టాక్. రామ్ డిజిటల్ రంగంలో ఉంటూ వెబ్ సిరీస్, షోస్ చేస్తుంటారు.
సునీతతో ఒక వెబ్ సిరీస్ నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారట. గతంలో సినిమా (శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘అనామిక’లో ప్రొమోషనల్ సాంగ్‌లో కనిపించారు. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు) అవకాశాలు వచ్చినా చేయని సునీత ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సుముఖంగా ఉన్నారట. అయితే నటిగా కాదు.. ఈ సిరీస్ నిర్మాణ వ్యవహారాలు చూసుకోనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి.. సునీత కొత్త జర్నీ నటనవైపా? ప్రొడక్షన్ వైపా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment