Prema Desam Yuvarani: సింగర్‌ సునీత ఆలపించిన ఈ సాంగ్‌ విన్నారా? | Prema Desapu Yuvarani Nishabdham Aaye Lyrical Song Out Now - Sakshi
Sakshi News home page

Prema Desam Yuvarani: సింగర్‌ సునీత ఆలపించిన ఈ సాంగ్‌ విన్నారా?

Published Wed, Aug 30 2023 12:52 PM | Last Updated on Wed, Aug 30 2023 1:13 PM

Nishabdhamaaye Song Out From Prema Desam Yuvarani Movie - Sakshi

యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రలు పోషించిన తాజా చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’.  సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు.  ఇటీవల ఈ చిత్రంలోని ‘మసకతడి’ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోపాటను ఆవిష్కరించారు.

‘నిశబ్దం’ అంటూ సాగే ఈ పాటకు అజయ్‌ పట్నాయక్‌ సంగీతం అందించగా.. ప్రముఖ గాయనీ సునీత అద్భుతంగా ఆలపించారు. చిత్ర దర్శకుడే ఈ పాటను రాయడం విశేషం. సెప్టెంబర్‌ 2న  ఈచిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ ఇది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే బాండింగ్‌తో సినిమా జ్ఞాపకాలను ఇంటికి తీసుకెళ్తారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది.  ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌, పాటలకు చక్కని స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అలాగే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement