పెళ్లి చేసుకోబోతున్న సింగర్‌ సునీత? | Singer Sunitha Marriage Rumours Gone Viral | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 19 2018 9:59 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Singer Sunitha Marriage Rumours Gone Viral - Sakshi

టాలీవుడ్‌లో తన సుమధుర గానంతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు సింగర్‌ సునీత. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆమె త్వరలో మరో వివాహం చేసుకోబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరు? అన్నదానిపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. ఈ వార్తపై సింగర్‌ సునీత ఎలా స్పందిస్తారో చూడాలి. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ‘సునీత ఉపద్రష్ట’.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు. 19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు.

రెండో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారంటూ కొన్ని కథనాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కథనాలపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement