కేటీఆర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న దర్శకుడు రాఘవేంద్రరావు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న టీ–సాట్ భవనంలో ఓ ఫ్లోర్‌లో టీటీడీకి చెందిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కనిపించారు. ఇదే భవనం స్టూడియోలో తమ అన్నమయ్య పాటకుపట్టాభిషేకం అనే సెట్ ఉందని పాటల కార్యక్రమం కొనసాగుతున్నదని రావాల్సిందిగా ఆహ్వానించారు. రాఘవేంద్రరావు ఆహ్వానంతో కేటీఆర్ ఆసెట్‌లోకి వెళ్లి గాయకులను పలకరించారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాఘవేంద్రరావు, కీరవాణి, సునీత జ్ఞాపికను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment