Singer Sunitha Reveals Her Energy Secret- Sakshi
Sakshi News home page

నా ఎనర్జీకి కారణం అదే, సీక్రెట్‌ రివీల్‌ చేసిన సునీత

Published Thu, Aug 12 2021 3:19 PM | Last Updated on Thu, Aug 12 2021 6:37 PM

Singer Sunitha Reveals Her Energy Secret	 - Sakshi

సింగర్‌ సునీత క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. అంతేగాక చీరకట్టుతో అచ్చం తెలుగుంటి అమ్మాయిలా చూడముచ్చటగా ఉంటారు. నాలుగు పదుల వయసులో కూడా నేటి తరానికి పోటీ ఇస్తున్నారు. ఇక ఆమెకు ఉండే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. స్టార్‌ నటీనటులకు సమానమైన అభిమానులను సంపాదించుకున్న ఆమె పరిశ్రమలో గాయనీగా మాత్రమే కాకుండా డబ్బింగ్‌ అర్టిస్ట్‌గా, టెలివిజన్‌ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు.

కెరీర్‌లో అలా దూసుకుపోతున్న సునీత ఇటీవల మ్యాంగో అధినేత, వ్యాపారవేత్త అయిన రామ్‌ వీరపనేనిని రెండవ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం సునీత సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చిట్‌చాట్‌ నిర్వహించి అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పాటలను ఆలపించి వారికి వినోదాన్ని పంచారు. ఇప్పటికీ కూడా వీలు చిక్కినప్పుడల్లా లైవ్‌ సెషన్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తను పాట పడుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘పాట పాడటమే నా ఎనర్జీ’ అంటూ తన సీక్రెట్‌ రివీల్‌ చేశారు. 

కాగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సునీత తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే.  గతంలో తాను ఎదుర్కొన్న ఎన్నో చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో తగిలిన ఎదు దెబ్బల కారణంగా మనుషులను పూర్తిగా నమ్మడం మానేశానన్నారు. అలాగే తన మొదటి పెళ్లి తర్వాత ఎన్నో విషయాలు తెలిసొచ్చాయని, విడాకుల అనంతరం సుమారు 15 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలను అనుభవించానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత రెండవ పెళ్లి విషయంలో రామ్ నిజాయితీగా అనిపించారని.. అందుకే ఆయనను వివాహం చేసుకున్నన్నారు. కానీ డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నానని కొంతమంది చేసిన కామెంట్స్‌ బాధించాయని ఆమె చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement