మహేష్ బాబు సినిమాలో సునీత? | singer sunitha in mahesh babu's film? | Sakshi
Sakshi News home page

మహేష్ బాబు సినిమాలో సునీత?

Published Mon, Apr 20 2015 12:02 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

మహేష్ బాబు సినిమాలో సునీత?

మహేష్ బాబు సినిమాలో సునీత?

హైదరాబాద్: గాయని సునీత నటిగా మారనుందా? గతంలో నటిగా అనేక అవకాశాలను కాదనుకున్న సునీత సరికొత్త పాత్రలో కనువిందు చేయడానికి సిద్ధమవుతుందా?అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అది కూడా మహేష్ బాబు సినిమాతో నటిగా ఆరంగేట్రం చేయడానికి ఆమె సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా అడ్డాల శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రంలో సునీత కీలక పాత్ర పోషించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సునీత కూడా ఒప్పుకుందని.. ఇక నటించడమే తరువాయి అని సినీ వర్గాల్లో వినికిడి.

1995 వ సంవత్సరంలో  గులాబీ చిత్రం ద్వారా గాయనిగా తెలుగు తెరకు పరిచయమైన సునీత ఆపై తనకంటూ ఓప్రత్యేకతను  సృష్టించుకుంది. దాదాపు 750 పైగా చిత్రాలకు తన సుమధుర గొంతుతో డబ్బింగ్ పాత్రలో కూడా మెరిసింది. మరి అయితే ఇప్పటి వరకూ వెండి తెరపై ఒక వైపే కనిపించిన సునీత.. మరి నటిగా మారి తన అభినయంతో ఆకట్టుకుంటుందో లేదో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement