
సాక్షి, తిరుమల : ప్రముఖ సింగర్ సునీత గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న సునీతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల తన ఎంగేజ్‌మెంట్ జరిగిందని అందుకే స్వామి వారి ఆశీస్సులు పొందటానికి వచ్చానన్నారు. లాక్ డౌన్‌లో శ్రీవారి దర్శనానికి రాలేకపోయానని, ఇన్నాళ్లకు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ( సంక్రాంతికి ముందే సింగర్ సునీత పెళ్లి!)
కాగా, వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో కొద్దిరోజుల క్రితం సునీతకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో డిసెంబర్ 20 ఆదివారం రాత్రి సునీత, రామ్‌ల ప్రీవెడ్డింగ్ కార్యక్రమం జరిగింది. టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ ఈ కార్యక్రమానికి హజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment