కరోనా నుంచి కోలుకున్నాను: సింగర్‌ సునీత | Singer Sunitha Reveals That She Has Tested Positive | Sakshi
Sakshi News home page

కరోనా నుంచి కోలుకున్నాను: సింగర్‌ సునీత

Aug 18 2020 10:40 PM | Updated on Mar 22 2024 11:24 AM

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ సునీత తాను కరోనా బారిన పడినట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తనకు మహమ్మారి సోకిందని.. అయితే ప్రసుతం దాని నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సునీత ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

ఓ ప్రోగ్రాం షూటింగ్‌ సమయంలో తనకు తలనొప్పి  రాగా టెస్టు చేయించుకోవడంతో.. కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లో ఉండి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. మహమ్మారితో పోరాటం అంత సులువేమీ కాదని.. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement