
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ‘డర్ట్ బైకింగ్ చాలెంజ్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 45 నగరాల్లో 90 రోజుల పాటు ఐదు స్థాయిల్లో ఈ పోటీని నిర్వహించనుంది.
మొదటి స్థానంలో నిలిచిన విజేతకు, రెండో స్థానంలో వచ్చిన ఇద్దరికి హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ మోటార్‌సైకిళ్లు, స్పాన్సర్‌షిప్ కాంట్రాక్టులు లభిస్తాయి. వీటి విలువ దాదాపు రూ.20 లక్షల మేరకు ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని నవంబర్‌లో ఎంటీవీతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వీఓఓటీలోనూ టెలీకాస్ట్ చేస్తారు. చక్కటి డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగిన యువత రేసింగ్ విభాగంలో ఎదిగేందుకు ఇది ఉత్తమ వేదిక అవుతుందని హీరో మోటాకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment