Hero MotoCorp company
-
బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ మోటర్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 1,500 వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్స్, మార్కెట్లను బట్టి పెంపు పరిమాణం ఉంటుందని సంస్థ వివరించింది. ‘ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచక తప్పడం లేదు’ అని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ధరల భారం ప్రభావం కస్టమర్లపై ఎక్కువగా పడకుండా వినూత్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందించడం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పరిశ్రమ అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నట్లు గుప్తా వివరించారు. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
బైక్ లవర్స్‌కు బంపరాఫర్!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ‘డర్ట్ బైకింగ్ చాలెంజ్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 45 నగరాల్లో 90 రోజుల పాటు ఐదు స్థాయిల్లో ఈ పోటీని నిర్వహించనుంది. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు, రెండో స్థానంలో వచ్చిన ఇద్దరికి హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ మోటార్‌సైకిళ్లు, స్పాన్సర్షిప్ కాంట్రాక్టులు లభిస్తాయి. వీటి విలువ దాదాపు రూ.20 లక్షల మేరకు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని నవంబర్‌లో ఎంటీవీతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వీఓఓటీలోనూ టెలీకాస్ట్ చేస్తారు. చక్కటి డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగిన యువత రేసింగ్ విభాగంలో ఎదిగేందుకు ఇది ఉత్తమ వేదిక అవుతుందని హీరో మోటాకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ వివరించారు. -
హీరో మోటోకార్ప్‌పై ఐటీ శాఖ దాడులు..! కంపెనీ ఛైర్మన్ ఇంట్లో సోదాలు
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని హీరో మోటోకార్ప్ కార్యాలయంతో పాటు సంస్థ సీఈవో పవన్ ముంజల్ నివాసంలో ప్రస్తుతం సోదాలు జరుపుతోంది. హీరో మోటోకార్ప్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 25 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కంపెనీ, కంపెనీ ప్రమోటర్లకు చెందిన ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక పత్రాలను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆదాయ పన్ను శాఖ సోదాలపై ఇప్పటికైతే ఆ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐటీ దాడుల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ స్టాక్స్ 1.5 శాతం మేర పడిపోయాయి. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ దాదాపు 40 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో యూనిట్ వాల్యూమ్ విక్రయాల పరంగా 2001లో హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మాన్యుఫాక్చరర్‌గా నిలిచింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 100 మిలియన్ యూనిట్స్ విక్రయాలు చేపట్టింది. దేశీయ ద్విచక్ర వాహన తయారీ రంగంలో హీరో మోటోకార్ప్‌కి 50 శాతానికి పైగా షేర్ ఉంది. చదవండి: టీసీఎస్ సంచలనం..5జీ..6జీ!! -
ఒక్క రోజులో లక్ష స్కూటర్ల విక్రయం
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన పరిశ్రమలో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ గత వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక్క రోజు లక్ష యూనిట్లకు పైగా రిటైల్ చేసినట్లు తెలిపింది. ఆగస్టు 9నతో మా ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందని.. హీరో మోటోకార్ప్‌లో ఇదొక మైలురాయి అని కంపెనీ సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ తెలిపారు. దేశీయ, గ్లోబల్ మార్కెట్లలో పండుగలు లేని సమయంలో కూడా కస్టమర్లు ఈ స్థాయిలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో కొనుగోళ్లు జరపడం ఇదే ప్రథమమని చెప్పారు. కొత్తగా విడుదల చేసిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 స్కూటర్లకు అధిక డిమాండ్‌తో పాటు ఇతర బైక్స్లు రోజు వారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిపాయని తెలిపారు. చదవండి : సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు -
హీరో మోటో భారీ విస్తరణ ప్రణాళికలు
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్.. భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. ఇందు కోసం వచ్చే 5–7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ ప్రకటించారు. ఈ ఏడాదిలో 10 కోట్ల వాహన విక్రయాల మైలురాయిని అధిగమించే అవకాశం ఉందని వెల్లడించారు. బీఎస్–6 గ్లామర్ విడుదల: భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్ఘార నిబంధనలకు అనుగుణంగా ఉన్న హీరో గ్లామర్ బైక్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధరల శ్రేణి రూ. 68,900– 72,000 కాగా, ప్యాషన్ ప్రో ధరల శ్రేణి రూ. 64,990– 67,190గా నిర్ణయించింది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. -
హీరో మోటో టూరింగ్ బైక్స్ : బడ్జెట్ ధరలో
దేశీయ దిగ్గజ టూవీలర్ మేకర్ హీరో మోటొకార్ప్ కొత్త బైక్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ, కరిజ్మ 200 బైక్స్ పేరుతో మూడు సరికొత్త టైవీలర్స్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. లాంగ్ గ్యాప్ తరువాత హీరో కంపెనీ వీటిని 1న ఇవి మార్కెట్లో ఆవిష్కరించనుంది. తాజాగా ఈ బైక్స్ లైవ్ ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. 2017, 2018 ఈఐసీఎంఏషోలో పరిచయం చేసిన ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ అనే ఈ రెండు బైక్స్‌లోనూ ఇంజిన్ పరంగా దాదాపు ఒకేలా ఉండనున్నాయి. అయితే మెకానికల్‌గా స్వల్ప మార్పులతో రైడింగ్ స్టైల్ మాత్రం భిన్నంగా ఉండనున్నాయి. 200సీసీ ఇంజీన్, 5స్పీడ్ టాన్స్‌మిషన్, సింగిల్ ఛానల్ ఏబీఎస్, 17 అంగుళాల అల్లోయ్ వీల్స్ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఫ్లై స్క్రీన్, ఆల్ డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, బ్లూటూత్, నావిగేషన్, ఎల్ఈడీ లైట్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. వీటి ధరలు రూ.1-రూ.1.1 లక్షల మధ్య నిర్ణయించవచ్చని అంచనా. బడ్జెట్‌ధరలో అందుబాటులోకి రానున్న టూరింగ్ బైక్స్ ఇవే నని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కరిజ్మ 200 అనే మరో కొత్త బైక్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముందని తెలుస్తోంది. -
హీరో లాభం 967 కోట్లు
న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో రూ.967 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో సాధించిన నికర లాభం(రూ.718 కోట్లు)తో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని హీరో మోటొకార్ప్ తెలిపింది. నికర ఆదాయం రూ.6,923 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.8,564 కోట్లకు పెరిగిందని హీరో మోటొకార్ప్ చైర్మన్, ఎండీ, సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. వాహన విక్రయాలు 16.21 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.40 డివిడెండ్ ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఈ తాజా డివిడెండ్‌తో కలుపుకొని గత ఆర్థిక సంవత్సరానికి ఈ కంపెనీ మొత్తం రూ.95 డివిడెండ్‌ను ఇచ్చినట్లు అవుతుంది. 76 లక్షల వాహన విక్రయాలు... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.3,377 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 9% వృద్ధితో రూ.3,697 కోట్లకు పెరిగిందని పవన్ ముంజాల్ పేర్కొన్నారు. నికర అమ్మకాల ఆదాయం రూ.28,500 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.32,230 కోట్లకు ఎగిసిందని వివరించారు. ఇక వాహన విక్రయాలు 66.64 లక్షల నుంచి 14 శాతం వృద్ధితో 75.87 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు. అమ్మకాలు బాగా ఉండటంతో గత ఆర్థిక సంవత్సరంలో మరో సారి రికార్డ్ స్థాయి పనితీరు సాధించామని ముంజాల్ చెప్పారు. త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఏథర్ ఎనర్జీ కంపెనీలో 30 శాతం వాటాను రూ.201 కోట్లకు కొనుగోలు చేశామని, త్వరలోనే ఈ కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్, ఎస్340ను మార్కెట్లోకి తెస్తామని ముంజాల్ వివరించారు. ఈ ఏడాది 200 సీసీ బైక్‌లు–ఎక్స్ పల్స్, ఎక్స్ట్రీమ్ 200ఆర్ల అమ్మకాలు ఆరంభిస్తామని పేర్కొన్నారు. రూ.2,500 కోట్ల పెట్టుబడులు.. మార్కెట్లో అగ్రస్థానాన్ని నిలుపుకోవడానికి ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రూ.2,500 కోట్ల మేర పెట్టుడులు పెట్టనున్నామని పవన్ ముంజాల్ చెప్పారు. కొత్త మోడళ్ల బైక్‌లు, స్కూటర్ల కోసం, గుజరాత్ ప్లాంట్ విస్తరణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం ఈ నిధులు వినియోగిస్తామని కంపెనీ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్ఈలో హీరో మోటొకార్ప్ షేర్ 2 శాతం నష్టంతో రూ.3,662 వద్ద ముగిసింది. -
ఎక్స్‌ట్రీమ్‌లో కొత్త వేరియంట్
ధర రూ. 72,725 న్యూఢిల్లీ: హీరోమోటోకార్ప్ కంపెనీ 150 సీసీ కేటగిరీలో అప్డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ పేరుతో ఈ అప్‌డేటెట్ వేరియంట్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ బైక్ దర రూ.72,725 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని పేర్కొంది. కొత్త రకంగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్, ట్విన్ ఎల్ఈడీ పైలట్ ల్యాంప్స్ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించింది. శక్తివంతమైన ఇంజిన్, స్టైల్‌ల కలబోతగా రూపొందించిన ఈ బైక్‌కు మంచి ఆదరణ లభించగలదని కంపెనీ ఆశిస్తోంది. గత నెలలో కంపెనీ అందించిన రెండవ ఉత్పత్తి ఇది. గత నెల ప్రారంభంలో ప్యాషన్ ప్రొలో అప్డేటెడ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది.