దేశీయ దిగ్గజ టూవీలర్ మేకర్ హీరో మోటొకార్ప్ కొత్త బైక్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ, కరిజ్మ 200 బైక్స్ పేరుతో మూడు సరికొత్త టైవీలర్స్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. లాంగ్ గ్యాప్ తరువాత హీరో కంపెనీ వీటిని 1న ఇవి మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. తాజాగా ఈ బైక్స్ లైవ్ ఫోటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
2017, 2018 ఈఐసీఎంఏషోలో పరిచయం చేసిన ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ అనే ఈ రెండు బైక్స్‌లోనూ ఇంజిన్ పరంగా దాదాపు ఒకేలా ఉండనున్నాయి. అయితే మెకానికల్‌గా స‍్వల్ప మార్పులతో రైడింగ్ స్టైల్ మాత్రం భిన్నంగా ఉండనున్నాయి.
200సీసీ ఇంజీన్, 5స్పీడ్ టాన్స్‌మిషన్, సింగిల్ ఛానల్ ఏబీఎస్, 17 అంగుళాల అల్లోయ్ వీల్స్ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఫ్లై స్క్రీన్, ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, బ్లూటూత్, నావిగేషన్, ఎల్ఈడీ లైట్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. వీటి ధరలు రూ.1-రూ.1.1 లక్షల మధ్య నిర్ణయించవచ్చని అంచనా. బడ్జెట్‌ధరలో అందుబాటులోకి రానున్న టూరింగ్ బైక్స్ ఇవే నని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక కరిజ్మ 200 అనే మరో కొత్త బైక్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment