హిందీ నటుడు ఫరాజ్ ఖాన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ‘ఫరీబ్’ (1996), ‘మెహందీ’ (1998) తదితర చిత్రాల్లో హీరోగా నటించారాయన. బాలీవుడ్ నటుడు ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఫేమ్ యూసఫ్‌ఖాన్ కుమారుడు ఫరాజ్. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా ‘మైనే ప్యార్‌కియా’కి మొదటగా ఫరాజ్‌ఖాన్‌నే హీరోగా అనుకున్నారు. అయితే సినిమా ప్రారంభానికి ముందు ఫరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో ఆ సినిమా చేసే అవకాశం సల్మాన్‌ఖాన్ దక్కించుకున్నారు. కాగా కొన్ని వారాల క్రితం పహ్ మాన్ ఖాన్ తన సోదరుడు ఫరాజ్ అనారోగ్యం గురించి చెబుతూ, ఆర్థిక సహాయం కూడా కోరారు. అప్పుడు సల్మాన్ ఖాన్ సహాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment