![Hero Electrc Scooter Gives Mileage of More Than 200 kilometers - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/21/37.jpg.webp?itok=7qHT7CUM)
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ హీరో ఎలెక్ట్రిక్ స్కూటర్ పేరు నిక్స్ హెచ్ ఎక్స్. దీని ప్రారంభ ధర రూ.64,540. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదు. ఇందులో ఆప్టిమా హెచ్ ఎక్స్, నిక్స్ హెచ్ ఎక్స్, ఫోటాన్ హెచ్ ఎక్స్ అనే మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చూడటానికి అన్నిటికంటే పొడవుగా చాలా భిన్నంగా ఉన్నాయి. సామాన్యులు, గ్రామీణ ప్రజలకు తగ్గట్టుగా వీటిని తయారు చేశారు. స్పీడ్, రేంజ్ బట్టి స్కూటర్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఈ స్కూటర్లలో మోడల్‌ని బట్టీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 82 కిలోమీటర్ల నుంచి 210 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తాయి. ఇందులో ప్రారంభ మోడల్ 82 కిలోమీటర్లు వెళ్తే టాప్ మోడల్ 210 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లలో నిక్స్ హెచ్ ఎక్స్ హై స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. అంటే ఇది సిటీలో ప్రయాణించేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. వెనక రైడర్‌కి మూడు గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి. ఓ బాటిల్ హోల్డర్ ఉంది. దీనికి 1.536 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇస్తున్నారు. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంది. ఎవరైనా హీరో బైక్ లేదా స్కూటర్‌ను ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందాలనుకుంటే డౌన్ పేమెంట్ రూ.4999 ఉంది. వడ్డీ రేటు రూ.6.99గా నిర్ణయించింది కంపెనీ. పూర్తీ వివరాల కోసం హీరో ఎలక్ట్రిక్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment