Actor Babushan Mohanty Says I Will Not Do Film With Prakruti Mishra, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Babushaan Mohanty Video: హీరోయిన్‌పై హీరో భార్య దాడి.. ఆమెతో సినిమా చేయనన్న నటుడు

Published Sun, Jul 24 2022 4:49 PM | Last Updated on Sun, Jul 24 2022 5:56 PM

Babushan Mohanty: I Will Not Do Film With Prakruti Mishra - Sakshi

ఒడియా హీరో బాబుషాన్‌ మెహంతి, హీరోయిన్‌ ప్రకృతితో కారులో కనిపించాడు. ఇంకేముందీ విషయం తెలుసుకున్న హీరో భార్య తృప్తి వారికి నడిరోడ్డు మీదే ఆపి హీరోయిన్‌ను చెడుగుడు ఆడుకుంది. జుట్టుపట్టుకుని లాగుతూ ప్రకృతిపై దాడి చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. తాజాగా దీనిపై హీరో బాబుషాన్‌ స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ.. 'వైరల్‌గా మారిన మా వీడియోను చూసి ఎంజాయ్‌ చేస్తున్నట్లున్నారు. కానీ నేను మీకో విషయాన్ని స్పష్టం చేయాలి. చెన్నైలో ఓ ఈవెంట్‌కు వెళ్లాను, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు ప్రకృతిని కూడా పిలిచారు. నిజానికి మేమిద్దరం త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం, దాన్ని అధికారికంగా ప్రకటించాలనుకునేలోపే ఇలా జరిగింది. నా కుటుంబం ఈ రకంగా ఆలోచిస్తుందని ఊహించలేదు. ప్రకృతి వాళ్లకు సమస్య అయితే ఆమెతో నేను సినిమా చేయను.. ఇంకా అవసరమైతే భవిష్యత్తులోనూ ఏ హీరోయిన్‌తో పని చేయను' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: హీరోయిన్‌పై హీరో భార్య దాడి, వీడియో వైరల్‌
కేటీఆర్‌ గారూ, ఈ సినిమాల మీద ఓ లుక్కేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement