
న్యూఢిల్లీ: హీరో గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ వెంచర్ హీరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ వినియోగదారుల ఉత్పత్తుల సెగ్మెంట్లోకి ప్రవేశిస్తోంది. రానున్న ఐదేళ్లలో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఉత్పత్తులను పదింటిని అందించనున్నామని హీరో ఎలక్ట్రానిక్స్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉజ్వల్ ముంజాల్ పేర్కొన్నారు. హోమ్ ఆటోమేషన్, వాహన, ఆరోగ్య, వినోద రంగాలకు సంబంధించి ఈ ఉత్పత్తులుంటాయని... క్వాల్‌కామ్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. లాస్‌వేగాస్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ కంపెనీ తన ఉత్పత్తులను ప్రదర్శిస్తోంది.