
నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటించిన చిత్రం రహస్య, శివ శ్రీ మీగడ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్‌ఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమి నిర్మించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర హీరో నివాస్ శిష్టు మీడియాతో మాట్లాడుతూ.. 'మాది వైజాగ్ దగ్గర పాలకొండ, నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. నాకు యాక్టింగ్ చేయాలనే డ్రీమ్ ఉన్నా సరైన వేదిక దొరకలేదు..
నా చదువు పూర్తయ్యాక నా ఫ్రెండ్ సాయంతో కెనడా వెళ్లి అక్కడ సెటిల్ అయిన నాకు కరోనా టైమ్‌లో "రహస్య" కథ నా దగ్గరకు వచ్చింది. ఇది నా మొదటి చిత్రం ఇక్కడ చాలా మంది నటులు ఉన్నా ఇలాంటి మంచి సినిమాలో హీరోగా విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారిగా నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నేను నటనలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. టీం అంతా ఫుల్ సపోర్ట్ చేయడంతో నాకు నటన ఈజీ అయ్యింది' అన్నాడు నివాస్ శిష్టు.
చదవండి: ఫోన్ కొనిచ్చేందుకు నాన్న అప్పు చేశాడు: నేహా చౌదరి
ఇద్దరు మాజీ ప్రియులతో సుష్మితా సేన్ పార్టీ
Comments
Please login to add a commentAdd a comment