
సాక్షి,నరసన్నపేట(శ్రీకాకుళం): తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం విడుదలవుతున్న ‘కరణ్ అర్జున్’ సినిమాలో హీరో నరసన్నపేట కుర్రాడే. పట్టణానికి చెందిన డాక్టర్ పొన్నాన సోమేశ్వరరావు కుమారుడు పొన్నాన మోహిత్ అభిమన్యు ఈ సినిమాలో హీరో. నరసన్నపేటలోనే పుట్టి పెరిగి సినిమాలపై ఉన్న ఆకాంక్షతో హైదరాబాద్ వెళ్లి మొదట్లో కొన్ని షార్ట్‌ఫిల్మ్‌లు చేశారు.
ఇప్పుడు హీరోగా ప్రజల ముందుకు వస్తున్నారు. ఆర్‌ఆర్ థ్రిల్లర్స్ ప్రొడక్షన్స్‌పై కరణ్ అర్జున్ నిర్మించారు. మోహన్ శ్రీ వత్స కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. నూతన నటి షఫా హీరోయిన్‌గా నటిస్తున్నారు. నరసన్నపేటలో హీరో హీరోయిన్లు మాట్లాడుతూ సినిమాను ఆదరించాలని కోరారు.