తెలుగులో హీరోగా పుష్ప ఫేమ్‌ 'జాలిరెడ్డి'.. | Pushpa Fame Jolly Reddy Turns As Hero For Badawa Rascal | Sakshi
Sakshi News home page

Jolly Reddy: 'బడవ రాస్కెల్'గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్న జాలిరెడ్డి..

Published Sat, Jan 29 2022 4:47 PM | Last Updated on Sat, Jan 29 2022 4:51 PM

Pushpa Fame Jolly Reddy Turns As Hero For Badawa Rascal - Sakshi

Pushpa Fame Jolly Reddy Turns As Hero For Badawa Rascal: కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన 'బడవ రాస్కెల్' చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల అవడానికి సిద్ధమవుతుంది. డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగులో పలు విజయవంతమైన సినిమాలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తుండడం విశేషం.

 

తెలుగులో భారీ విజయం సొంతం చేసుకున్న పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రతో ప్రేక్షకులను అలరించిన ధనుంజయ్ ఈ సినిమాలో హీరోగా నటించగా అమృత అయ్యంగార్ హీరోయిన్‌గాగా నటించింది. గీతా శివరాజ్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని సావిత్రమ్మ అడవి స్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. తొందరలోనే ఈ సినిమా కు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement