నేనే హీరో | vijay devarakonda with anand annamalai | Sakshi
Sakshi News home page

నేనే హీరో

Published Thu, Mar 14 2019 5:41 AM | Last Updated on Thu, Mar 14 2019 5:41 AM

vijay devarakonda with anand annamalai - Sakshi

విజయ్‌ దేవరకొండ

‘అర్జున్‌ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా’ వంటి సూపర్‌  హిట్స్‌ అందుకున్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం స్పీడ్‌ పెంచారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరిన్ని సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో బిజీగా ఉన్న విజయ్‌  క్రాంతి మాధవ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు విజయ్‌. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌(సీవీఎం) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్‌ని ప్రకటించారు. ఏప్రిల్‌ 22న ఢిల్లీలో షూటింగ్‌ ఆరంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement