
అల్లు అర్జున్‌తో నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా?

నో ఛాన్స్ అంటారేమో!

కానీ ఇక్కడో హీరో మాత్రం నటించనని చెప్పేశాడట!

ఇంతకీ ఎవరా హీరో?

బన్నీతో కలిసి యాక్ట్ చేసే అదృష్టం వస్తే చేయనని చెప్పిన వ్యక్తి ఎవరనుకుంటున్నారా?

అతడే హీరో విశాల్..

ఇతడు తెలుగువాడైనా తమిళంలోనే క్లిక్కయ్యాడు.

కోలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగులో ఓ సినిమాకు నో చెప్పిన విషయాన్ని బయటపెట్టాడు.

వరుడు సినిమా కోసం దర్శకుడు గుణశేఖర్ అడిగారు.

కానీ నాకు ఏదో తేడా కొట్టి చేయనని చెప్పానని పేర్కొన్నాడు.

వరుడు డిజాస్టర్ మూవీ కావడంతో వదులుకుని మంచి పనే చేశావని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.








