
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ కొత్త సినిమాను ప్రకటించాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఓ బహు భాషా చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు విజయ్. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ భారీ చిత్రానికి హీరో అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు.
అయితే అదే ‘హీరో’ టైటిల్‌తో తమిళ హీరో శివకార్తికేయన్ బుధవారం ఓ సినిమాను ప్రారంభించారు. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో శివకార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో విజయ్ సినిమాకు టైటిల్ సమస్య ఏర్పడింది. శివకార్తికేయన్ సినిమా యూనిట్ తమిళ నిర్మాతల మండలిలో టైటిల్ తాము రిజిస్టర్ చేసుకున్నట్టుగా సాక్ష్యాలను కూడా బయటపెట్టింది. షూటింగ్ ప్రారంభం కావటంతో ఆ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ పరిస్థితుల్లో విజయ్ తన సినిమా తమిళ వర్షన్ టైటిల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది మాసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment