
వారంనుంచే విద్యార్థుల ఇంటిబాట..
ఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులు వేసవి సెలవులకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ముందస్తుగా ఇంటిబాట పడుతున్నారు. వారం రోజుల ముందు నుంచే సంబంధిత వార్డెన్లు, హెడ్మాస్టర్లు విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో వారి తల్లిదండ్రులు వచ్చి పెట్టెబేడతో ఇంటికి తీసుకెళ్తున్నారు. దీంతో వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు ఖాళీ అవుతున్నాయి. అయితే ఈ విద్యార్థుల అనుమతి ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందా లేక హాస్టల్ వార్డెన్, హెడ్మాస్టర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అధ్యాపకురాలు శిరీషకు డాక్టరేట్ ప్రదానం
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న బి.శిరీష డాక్టరేట్ అందుకున్నారు. కేయూలోని వాణిజ్యశాస్త్రం, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ప్రమోషన్ ఆన్ ఆన్‌లైన్ బయింగ్ బి హేవియర్–ఏ స్టడీ అనే ఆంశంపై కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేశారు. ఈ మేరకు ఆమె సమర్పించిన సిద్ధాంతగ్రంధానికి కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా కళాశాలలో శిరీషకు గురువారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

వారంనుంచే విద్యార్థుల ఇంటిబాట..