
కొనసాగుతున్న కూంబింగ్
● కర్రిగుట్టలపై గుహ ఉన్నట్లు ప్రచారం
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో ఆరు రోజులుగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గుట్టల్లో మావోయిస్టుల ఆగ్రనేతలతో పాటు సుమారుగా వెయ్యిమంది ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఆదివారం 6వ రోజు కూంబింగ్‌లో భాగంగా గుట్టలపై వెయ్యి మంది నివాసం ఉండే విధంగా గుహ ఉందని అందులో నీటి సదుపాయంతో పాటు నిత్యావసర సరుకులు, ఆయుధాలు ఉన్నట్లు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లిన జవాన్లు గుర్తించారని, జవా న్ల రాకను గమనించి అక్కడ తలదాచుకున్న మావోయిస్టులు వేరే ప్రాంతానికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా ఇప్పటి వరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
నిరసన ర్యాలీ
మంగపేట: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ మండల పరిధిలోని కమలాపురం జామియా మసీదు కమిటీ సభ్యులు ఆదివారం అంబేడ్కర్ సెంటర్ నుంచి జామా మసీదు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలని కోరారు.