
వినతుల వెల్లువ
గ్రీవెన్స్, గిరిజన దర్బార్‌లో సమస్యలు పరిష్కరించాలని బాధితుల మొర
ములుగు/ఏటూరునాగారం: కలెక్టరేట్, ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్, గిరిజన దర్భార్‌కు ప్రజలు భారీగా తరలివచ్చి పలు సమస్యలపై వినతులు అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్లు సంపత్‌రావు, మహేందర్‌జీలు ప్రజల నుంచి 39దరఖాస్తులు స్వీకరించారు. ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా 15దరఖాస్తులు స్వీకరించారు. మొత్తంగా వివిధ సమస్యలపై 54 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. గ్రీవెన్స్ సెల్‌లో భూ సమస్యలు పరిష్కరించాలని బాధితులు అత్యధిక దరఖాస్తులు సమర్పించారు.
గిరిజన దర్బార్‌లో
వినతులు ఇలా..
కన్నాయిగూడెం మండలం ఏహెచ్‌ఎస్‌లో సీఆర్‌టీగా పనిచేస్తున్న సనప సుహాసిని తన ఇటీవల పాపకు ఆపరేషన్ జరిగిందని.. అందుకోసం ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి భద్రాచలం ఐటీడీఏకు డిప్యూటేషన్ చేయాలని వేడుకున్నారు. కన్నాయిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆర్‌ఐటీఐ పూర్తి చేసిన ఆదివాసీలతో కట్టర్ జాబ్స్ భర్తీ చేయాలని బాధితులు కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ప్రాంతానికి చెందిన కేంసర్తి అరుణ ఏదైనా జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని వేడుకున్నారు. మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డు ప్రాంతంలో గల ఐటీడీఏ కాంప్లెక్స్ భవనం మరమ్మతులు చేయించాలని స్థానిక గిరిజన మహిళ బడే సులోచన కోరారు. మంగపేట మండలం బాలన్నగూడెం ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వాటిని తిరిగి ఇప్పించాలని గిరిజన రైతులు తిరుపతి, లక్ష్మయ్యతో పాటు మరో 14 మంది గిరిజనులు విన్నవించారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల ప్రాంతానికి చెందిన శ్రీరాములు, కృష్ణయ్యలు రెండ్యాల ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు సీసీ రోడ్డు, నీటి పైపులైన్‌లు నిర్మించేందుకు నిధులు మంజూరు ఇవ్వాలని కోరారు. తాడ్వాయి మండలం మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ తాడ్వాయిలోని ఎంపీపీఎస్‌కు కొత్త పాఠశాల నిర్మించాలని కోరారు. తాడ్వాయి మండలం రంగాపూర్, కోమటిపల్లి, చెల్పాక క్లాస్–4 ఉద్యోగులు ఇన్‌చార్జ్ వార్డులుగా పనిచేస్తూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ప్రమోషన్ కల్పించి గ్రేడ్–2 వార్డెన్‌గా ప్రమోషన్ కల్పించాలని పీఓకు విన్నవించారు. ఏటూరునాగారం మండలం గోగుపల్లిలో జరుపుల బానుచందర్ పంట చేనుకు బోరు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు, డీడీ పోచం, ఐటీఐ టీఏ మువీన్, విద్యుత్‌శాఖ ఏఈ ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ ఫొటోలో ఉన్నవ్యక్తి పేరు ఎట్టి రేవతి. ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం భూపతిపురంకు చెందిన గిరిజన మహిళ. 2016లో జీఎన్‌ఎంగా పూర్తి చేసింది. ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జీఎన్‌ఎం పోస్టు ఇప్పించి ఆదుకోవాలని గిరిజన దర్బార్‌లో పీఓకు వినతి అందజేసేందుకు వచ్చింది. తనకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని పీఓకు మొరపెట్టుకుంది.
వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు, పీఓ
మొత్తంగా 54 దరఖాస్తుల స్వీకరణ
పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
u

వినతుల వెల్లువ

వినతుల వెల్లువ