
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం
ములుగు: అగ్ని ప్రమాదాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి నాగరాజు సూచించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌లో విద్యార్థులకు జిల్లా ఫైర్ అధికారి నాగరాజు, స్టేషన్ ఫైర్ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సురక్షితంగా బయటపడడంపై వివరించారు. అగ్ని ప్రమాదాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలను విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా వివరించారు. అనంతరం జిల్లా అధికారి నాగరాజు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ధైర్యంగా స్పందించాలని సూచించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్‌మెన్ మహేశ్వర్, డ్రైవర్, ఆపరేటర్ కుమార్, ఫైర్‌మెన్‌లు పాల్గొన్నారు.