
డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులు పూర్తిచేయాలి
గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో 2018లో 34 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల కమిటీని ఏర్పాటు చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టాం. ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం రూ.1.50కోట్లు మంజూరు అయ్యాయి. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 22లక్షలు నిలిచిపోయాయి. ఈ విషయంలో ఐటీడీఏ పీఓ, కలెక్టర్లకు పలుమార్లు పనులు పూర్తి చేయాలని విన్నవించాం. పెండింగ్ నిధులు మంజూరైతే ఇళ్ల పనులు పూర్తి అవుతాయి. ఒకేసారి నిధులు మంజూరు చేస్తే లబ్ధిదారులకు ఆసరాగా ఉంటుంది. – ఎన్టీఆర్ కాలనీ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల్ల లబ్ధిదారులు
●