
గిరిజన దర్బార్‌లో వినతులు ఇలా..
ఏజెన్సీలో గిరిజన సొసైటీలను ఏర్పాటు చేయాలని, వలలు, తెప్పలు గిరిజన మత్స్యకారులకు అందజేయాలని నాయకులు సిద్ధబోయిన సురేందర్, ఆలం భాస్కర్ విన్నవించారు. ఏజెన్సీలోనిసొసైటీలకు బడ్జెట్ కేటాయించాలన్నారు. గిరిజన మత్స్యకారులకు చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని, చేపలపెంపకం కోసం ఐటీడీఏ ద్వారా ఐదు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. మంగపేట మండలం రమణక్కపేటలో పడిగ సంధ్య తన భర్త శ్రీకాంత్ పేరు మీద ఉన్న పట్టా భూమిని వేరేవాళ్ల మీదకు మార్చుకొని భూమిని లాక్కున్నారని తెలిపారు. గంగారం మండలం దుబ్బగూడెంకు చెందిన ప్రశాంత్, ఇతరుల ఎంఎస్‌ఎంఈ అకౌంట్‌లో ఉన్న డబ్బులను డ్రా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.