
ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ ఎన్నిక
వెంకటాపురం(కె): ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆవరణలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమావేశం నిర్వహించి కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తాటి నాగరాజు, గౌరవ అధ్యక్షుడిగా పీర్ల మల్లిఖార్జున్, ప్రధాన కార్యదర్శిగా పోలేబోయిన కృష్ణారావు, ఉపాధ్యక్షులుగా సుననం సూరిబాబు, పాయం రాకేష్, బొగ్గుల సమ్మయ్య, సంయుక్త కార్యదర్శిగా బొగ్గుల సమ్మయ్య, ప్రచార కార్యదర్శిగా చీమల రామనాధం, కోశాధికారిగా ఉకె.జగన్, కార్యదర్శిగా బొగ్గుల నారాయణ, యాలం వెంకటరత్నం, చిక్కుడు ప్రవీణ్, శ్యామల వెంకటేశ్వర్లు, కణితి శేషును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఉయిక శంకర్, సోయం కామరాజు, నర్సింహరావు, పసుల సూర్యనారాయణ, సవలం వీరస్వామి, ఈసాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి
ములుగు: జిల్లా కేంద్రంలో సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 350 ఏళ్ల క్రితం మొఘల్ పాలకుల దౌర్జన్యాలకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అన్నారు. ప్రభుత్వం గీత కార్మికులకు ఉపాధి, వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూముల్లో తాటిచెట్లను నాటుకునే అవకాశం కల్పించాలన్నారు. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
కరాటే అసోసియేషన్
జిల్లా రిప్రజెంటేటివ్‌గా రాజు
ములుగు: కరాటే అసోసియేషన్ ములుగు జిల్లా రిప్రజెంటేటివ్, అఫిషీయల్ జడ్జిగా అజ్మీ ర రాజును నియమించారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కరాటే ఇండియా ఆర్గనైజింగ్ జాతీయ అధ్యక్షుడు భరత్‌శర్మ ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో ఫిజిక్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించానని తెలిపారు. అప్పటి నుంచి కరాటే పోటీల్లో పాల్గొంటూ గిరిజన విద్యార్థులకు కరాటే నేర్పిస్తూ జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దినట్లుగా వెల్లడించారు. ఈ సేవలను గుర్తించి జిల్లా రిప్రజెంటేటివ్‌గా నియమించినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజును తెలంగాణ కరాటే రిప్రజెంటేటివ్ పాపయ్య అభినందిచారు.
ఆదివాసీ చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యం
వెంకటాపురం(కె): ఆదివాసీ చట్టాలను అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు. మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఏజెన్సీ చట్టాలను గౌరవిస్తూ ఆదివాసీల ఆభివృద్ధికి పాటు పడాలన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఆదివాసీల బతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంటి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ ఎన్నిక