
ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం/మంగపేట: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మంగపేట మండల పరిధిలోని కోమటిపల్లి, గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పాఠశాల భవనాలకు పేయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. పరిశుభ్రత, విద్యుత్ సమస్యలు, డార్మెంటరీ మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తొండ్యాల, లక్ష్మీపూర్, వాగొడ్డుగూడెం, రమణక్కపేట గ్రామాల్లో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను పరిశీలించి నాణ్యతతో చేపట్టాలని, సైడ్ బర్మ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రశాంత్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ రాము, ఎన్‌హెచ్‌ఎం హెల్త్ ప్రాజెక్ట్ మేనేజర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా