బాలికలకు స్వీయ రక్షణ అవసరం | - | Sakshi
Sakshi News home page

బాలికలకు స్వీయ రక్షణ అవసరం

Published Mon, Apr 28 2025 7:12 AM | Last Updated on Mon, Apr 28 2025 7:12 AM

బాలిక

బాలికలకు స్వీయ రక్షణ అవసరం

ఏటూరునాగారం: బాలికలకు స్వీయ రక్షణ ఎంతో అవసరమని కరాటే మాస్టర్‌ అబ్బు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల జూనియర్‌ కళాశాల రెసిడెన్షియల్‌లో అడ్వాన్స్‌ కరాటే సమ్మర్‌ క్యాంపు ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, జిల్లా కరాటే అధ్యక్షుడు సూర్య సహకారంతో ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకతాయిలు బాలికల వెంటపడితే ఎలా రక్షించుకోవాలని ముఖ్యంగా నేర్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ 30వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్యాంపునకు హాజరైన 75మంది బాలబాలికలకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, కరాటే మాస్టర్లు హుస్సేన్‌, అమీర్‌, బాలకృష్ణ, ఇరుప రవి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

కరాటే మాస్టర్‌ అబ్బు

నాలుగు రోజుల పాటు సమ్మర్‌ క్యాంపు

బాలికలకు స్వీయ రక్షణ అవసరం1
1/1

బాలికలకు స్వీయ రక్షణ అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement