
2,208.34ఎకరాల్లో పంట నష్టం
మంగపేట: మండల పరిధిలో ఈ నెల 7న కురిసిన వడగండ్ల వర్షానికి 2,208.34 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మండల పరిధిలోని మల్లూరు. కొత్తమల్లూరు, నర్సింహాసాగర్, తిమ్మంపేట, బాలన్నగూడెం పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టించగా చేపట్టిన సర్వే సోమవారంతో ముగిసిందని వెల్లడించారు. కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన 4 టీములతో కూడిన 16మంది అధికారులు ఆయా గ్రామాల్లో దెబ్బతిన పంటలను 14రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వెల్లడించారు. అగ్రికల్చర్ కమిషనరేట్ నిబంధనల మేరకు 942మంది రైతులకు చెందిన 2,208.34ఎకరాల్లో పంటనష్టం సంభవించగా ఆ వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేసినట్లు వివరించారు.
గ్రామాల వారీగా పంటనష్టం వివరాలు ఇలా..
గ్రామం బాధిత రైతుల ఎకరాలు
సంఖ్య
నర్సింహాసాగర్ 323 829.12
నర్సింహాసాగర్ 33 84.25
(ఆర్‌ఓఎఫ్‌ఆర్)
నరేందర్‌రావుపేట 21 46.09
శనిగకుంట 03 13.20
తిమ్మంపేట 194 431.06
అబ్బాయిగూడెం 01 01
మొట్లగూడెం 06 17.11
మెట్టుగూడెం 02 6.30
కొత్తమల్లూరు 01 01
మల్లూరు 184 441.37
బాలన్నగూడెం 63 94.25
చెరుపల్లి 111 242.24
వివరాలు వెల్లడించిన అధికారులు