
పర్యాటకులపై దాడి అమానుషం
ములుగు రూరల్: కశ్మీర్‌లో పహల్గాంలో పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారిపై ఉగ్రవాదుల దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్యులరిజం ముసుగులో రాజకీయ పార్టీలు హిందువులను జెండాలు మోసే బానిసలుగా చూస్తున్నాయన్నారు. దేశాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల జీవితాలను, భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్‌లాల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి హరీశ్, కృష్ణాకర్‌రావు, రాజ్‌కుమార్, నాగరాజు, హేమాద్రి, పాపిరెడ్డి, మహేందర్, రఘుపతి, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం