
కలెక్టర్‌కు విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం
ములుగు రూరల్: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ టీఎస్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండి సాంబశివ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ప్రకటన తదుపరి పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు, హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సరికొండ బలరాం, భూక్య జవహర్‌లాల్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాకేష్‌యాదవ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.