
కర్రిగుట్టల్లో కొనసాగుతున్న కూంబింగ్
వెంకటాపురం(కె): తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో కేంద్ర బలగాలు చేపడుతున్న కూంబింగ్ సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా దట్టమైన కర్రిగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించడంతో పాటు ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేస్తూ ముందుకుసాగుతున్నాయి. మావోయిస్టుల స్థావరాలను కనుగొనే క్రమంలో ఒక్కో అడుగును జాగ్రత్తగా ముందుకు వేస్తున్నాయి. అయితే ప్రతిరోజూ తుపాకుల మోతలు, బాంబుల చప్పుళ్లు వస్తున్నాయనే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కర్రిగుట్టల్లో కొనసాగుతున్న కూంబింగ్