
అఫ్లియేషన్ కోసం తనిఖీలు నిర్వహిస్తాం
● కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు 2025–26 విద్యాసంవత్సరానికి అఫ్లియేషన్ ఇచ్చేందుకు కమి టీలతో తనిఖీ చేయిస్తామని కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల కళాశాలల కరస్పాండెట్లు, ప్రిన్సిపాల్స్‌తో క్యాంపస్‌లోని పరి పాలనాభవనం సెనెట్‌హాల్‌లో గురువారం అఫ్లియేషన్, అకాడమిక్ అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలల్లో ల్యాబ్స్, లైబ్రరీ, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. కళాశాల విద్యార్థులకు ‘ఆపార్ ఐడీ’ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
పోతే పోండి..
తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ గత మూడేళ్లుగా ఇవ్వలేదని అందుకే పరీక్షల ఫీజులు చెల్లించడంలేదని ఈనెల 28నుంచి నిర్వహించనున్న డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలను వాయిదావేయాలని ప్రైవేట్ కళాశాలల యాజామాన్యాలు కోరాయి. ఈ సమావేశం కేవలం అఫ్లియేషన్ కోసం అకడమిక్ పరంగా విషయాలను మాట్లాడేందుకే నిర్వహిస్తున్నామని ప్రతాప్‌రెడ్డి చెప్పడంతో.. తాము సమావేశాన్ని బహిష్కరిస్తామని ప్రైవేట్ యాజమాన్యాల బాధ్యులు అన్నారు. దీంతో వీసీ ప్రతాప్‌రెడ్డి స్పందిస్తూ పోతే పొండి.. ఉన్నవారితోనే మాట్లాడుతానని అన్నారు. దీంతో సమావేశం రసాభాసాగా మారింది. రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోయేషన్ బాధ్యుడు ఒకరు కలుగజేసుకుని సమావేశం నిర్వహించాలని కోరడంతో అంతాసద్దుమణిగింది.
పరీక్షలు జరగనివ్వం..
తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేవరకు ఫీజులు చెల్లించకపోగా.. పరీక్షలు సైతం నిర్వహించనివ్వమని ప్రైవేట్ కళాశా లల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో స్పందించిన కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కే యూ పరిధిలో లక్షా 70 వేలకుపైగా డిగ్రీ విద్యా ర్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుందని వారికి ఇ బ్బంది కలగనీవొద్దని కోరారు. టైంటేబుల్ ప్రకారం పరీక్షల ఫీజులు చెల్లించిన కళాశాలలకు పరీక్షలకు నిర్వహిస్తామని వీసీ పేర్కొన్నారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, సీడీసీ డీన్ వరలక్ష్మి, అకడమిక్ డీన్ హనుమంతు పాల్గొన్నారు.

అఫ్లియేషన్ కోసం తనిఖీలు నిర్వహిస్తాం